ప్రజాశక్తి – మార్టూరు రూరల్: విధుల్లో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవ బాపట్ల జిల్లా సమన్వయకర్త డాక్టర్ ప్రవీణ్ హెచ్చరించారు. మంగళవారం మార్టూరు సచివాలయం-2 సమీపంలో యద్దనపూడి ఆరో గ్యకేంద్రం వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్న 104 వాహ నాన్ని అయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని పరికరాలను, ల్యాబ్‌లో చేస్తున్న వైద్య పరీక్షలను పరిశీ లించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. 104 సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన, 104 జిల్లా మేనేజర్ జె.నాగేశ్వరరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.