విధి నిర్వహణపై అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు

Jun 10,2024 21:17

ప్రజాశక్తి- రేగిడి : గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమకు కేటాయించిన సచివాలయాలలో విధి నిర్వహణపై అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని ఎంపిడిఒ శ్యామల కుమారి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఎంపిడిఒ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 25 గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులు సమయాలు పాటించి, ప్రజలకు జవాబిదారితనంగా ఉండాలన్నారు. సచివాలయల నిర్వహణ బాధ్యతలు పంచాయతీ కార్యదర్శిలదేనని తెలిపారు. ఎప్పట ికప్పుడు సమాచారం మండలకేంద్రానికి పంపించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు సమయాలకు సచివాలయాలకు రాకుంటే ఎలా అని ప్రశ్నించారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు పరిచేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇఒపిఆర్‌డి ఏవి సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇ శ్రీ చరణ్‌ పాల్గొన్నారు.వేపాడ: స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులతో ఎంపిడిఒ నిశ్చల సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యంపై కార్యదర్శులు దృష్టి పెట్టాలన్నారు. రానున్నది వర్షాకాలం కాబట్టి ముందస్తు చర్యలో భాగంగా కాలువుల్లో పూడికలు తొలగించాలన్నారు. ఇఒపిఆర్‌డి ఉమా మాట్లాడుతూ గత సమావేశంలో కూడా పంచాయతీ కార్యదర్శులకు పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పిన్పటికీ ఇంకా కొన్ని పంచాయతీల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.

➡️