విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు : ఆర్‌డిఒ

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కనిగిరి ఆర్‌డిఒ జాన్‌ ఇర్విన్‌ తెలిపారు. తహశీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే 167 బి జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహార విషయంలో అలసత్వం చేయకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలన్నారు. భూ సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు తమ దష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని అంబవరం గ్రామంలో నేషనల్‌ హైవే వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్‌ బంకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అయ్యలూరివారిపల్లి గ్రామంలో కన్వర్షన్‌ భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️