ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్(ఎస్డబ్ల్యూసి) ల ద్వారా గ్రామ స్వచ్ఛతకు చర్యలు చేపట్టామని సర్పంచ్ తోట భవాని వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని సందిపూడిలో ఎస్డబ్ల్యూసి విభాగాన్ని కార్యదర్శి ఎస్.వీర్రాజు సమక్షంలో కూటమి శ్రేణులతో కలసి బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పల్లెల్లో ఈ వేస్ట్ పార్కులు వినియోగంలోకి వస్తే పరిశుభ్రతకు బాటలు వేసిన వారమవుతామన్నారు. గ్రామస్తులు తమ నివాసాలలో వచ్చే చెత్తను తడి, పొడి విడివిడిగా పారిశుధ్య కార్మికులకు అందజేసి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తోలేటి సంతోషి, నేతలు తోట వెంకటేశ్వర్లు, దొడ్డ సుబ్బారావు, నల్ల వెంకన్న, కాశీ విశ్వనాథం, గుత్తుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.