పని దినాలు కల్పించకపోతే చర్యలు

Sep 25,2024 22:00
ఫొటో : మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆనంద్‌

ఫొటో : మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆనంద్‌

పని దినాలు కల్పించకపోతే చర్యలు

ప్రజాశక్తి-ఉదయగిరి : ఉపాధి హామీ పథకంలో అధికారులు, సిబ్బంది కూలీలకు నిర్థేశిత పనిదినాలు కల్పించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ హెచ్చరించారు. బుధవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో ఉదయగిరి, దుత్తలూరు మండలాల ఉపాధి హామీ అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధి హామీ పథకాలకు ఎక్కువ అవకాశం కల్పించాలని డెల్టా ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు పెద్ద ప్రాధాన్యత ఉండదని అక్కడ పనులు దొరుకుతాయని మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, వరికుంటపాడు, సీతారాంపురం, దుత్తలూరు లాంటి మండలాలలో పనులు తక్కువ కాబట్టి ఎక్కువశాతం ఉపాధి హామీ పనులపైనే ప్రజలు దృష్టి పెడతారని అందుకోసం ఖచ్చితంగా నిర్థేశించిన పని దినాలు కల్పించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం సూచించిన 100 రోజుల పనిదినాలలో కనీసం 50శాతం పనులు తగ్గితే శాఖపరమైన చర్యలు ఉంటాయన్నారు. రైతులకు అనుసంధాంగా ఉన్న చిన్న కుంటలు, వ్యవసాయ పొలాల చుట్టూ కందకాలు, అలాగే పండ్ల మొక్కలు సరఫరా నాటించే కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. గ్రామస్తులతో కలిసి పంచాయతీ పరిధిలో గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏమైతే పనులు అవసరం ఉంటాయో అలాంటి పనులు చేపట్టాలని అక్కడే వారికి పని కల్పించాలని తెలిపారు. నెలరోజుల తర్వాత మళ్లీ సమీక్ష సమావేశం ఉంటుందని పురోగతిని పరిశీలిస్తామని, అనుకున్న పురోగతి సాధించలేని వారిపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో జిల్లా పిడి శ్రీనివాసరావు, ఆర్‌డిఒ మధులత, ఎపిడి గాయత్రి, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ శ్రీనివాసరాజు, ఎపిఒలు శ్రీనివాసులు, బ్రహయ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️