గెడ్డలు, వాగులు ఆక్రమిస్తే చర్యలు : కమిషనర్‌

Nov 14,2024 20:34

ప్రజాశకి-విజయనగరం టౌన్‌  :  నగర పరిధిలో గెడ్డలు, వాగులు, ప్రధాన కాలువలు ఆక్రమించి భవన నిర్మాణాలను చేపట్టారాదని, నిబంధనలు ఆక్రమించినట్లయితే అట్టి భవనాలను తొలగిస్తామని కమిషనర్‌ నల్లనయ్య తెలిపారు. గురువారం ఐదవ డివిజన్లో పర్యటించారు. అనుమతులు లేని కొన్ని భవనాలను గుర్తించి, తక్షణమే అపరాద రుసుములు విధించి, వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. గెడ్డను ఆక్రమించి నిర్మించిన ఓ భవనాన్ని గుర్తించి వెంటనే నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయ భవనానికి పన్ను విధింపుతో పాటు ఖాళీ స్థలం పన్నును కూడా విధించాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి ఎటువంటి నిర్మాణాలను చేపట్టరాదని అన్నారు. సహాయ కమిషనర్‌ సిహెచ్‌ తిరుమలరావు, టిపిఆర్‌ఓ సింహాచలం, సిటీ మిషన్‌ మేనేజర్‌ సన్యాసిరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌, వివిధ విభాగాల సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

నైపుణ్య గణన శత శాతం పూర్తి చేయాలి

ఇంటింటి నైపుణ్య గణన సర్వే శతశాతం పూర్తిచేయాలని సచివాలయ కార్యదర్శులకు, సిబ్బందికి కమిషనర్‌ పల్లి. నల్లనయ్య ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర పరిధిలో వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన, అలాగే ప్రతిభ ఉన్న వ్యక్తులను గుర్తించి తద్వారా వారికి మరింత మెరుగైన తర్ఫీదు నిచ్చి ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికీ వచ్చే తమ సిబ్బందికి పూర్తి వివరాలను అందించాలని ప్రజలకు సూచించారు. సమావేశంలో టిపిఆర్‌ఒ సింహాచలం, సిటీ మిషన్‌ మేనేజర్‌ సన్యాసిరావు, స్కిల్‌ సెషన్స్‌ మండల ఇన్చార్జి తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️