ప్రజాశక్తి – రేపల్లె : తెలుగుదేశం సభ్యత్వంతో కార్యకర్తలకు గుర్తింపు, భరోసా ఉంటాయని ఆ పార్టీ ప్రముఖ టిడిపి నాయకులు వీరవల్లి శివరామకృష్ణ అన్నారు. నందమూరి తారక రామారావు తరువాత నారా చంద్ర బాబు నాయుడు పార్టీని ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందు తున్నారన్నారు. ఇప్పటికే 70 లక్షల సభ్యత్వంతో బలమైన పార్టీగా ఎదిగిందన్నారు. ప్రతి కార్యకర్త చెల్లించిన సభ్యత్వ రుసుం మొత్తం తిరిగి కార్యకర్తలకు లబ్ది చేకూరే విధంగా యువనేత నారా లోకేష్ సరికొత్తగా ఆలోచించి ఇన్సూ రెన్సు పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. చనిపోయిన కార్య కర్తలకు గతంలో ఇచ్చిన రూ 2లక్షల పరిహారం రూ. 5 లక్షలకు పెంచారని అన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యకర్తలకు కొండంత భరోసా కల్పిస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సాధారణ మరణం సంభవించినా మట్టి ఖర్చుల కింద వారి కుటుంబానికి రూ.10వేలు అందిస్తుందన్నారు. 2024-25 సభ్యత్వ నమోదు డిసెంబర్ 2లోపు పూర్తి చేయాలన్నారు. నియోజక వర్గం లోని టిడిపి కుటుంబ సభ్యులందరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలన్నారు. నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ సభ్యులందరూ కలిసి సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయ వంతం చేయాలని కోరారు.