ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో పాడి రైతులకు అందుబాటులో ఉండి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పశు సంపద అభివద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పశు సంవర్తక శాఖ అధికారి కె.గుణశేఖర్ పెళ్లై పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో పశు సమర్థ శాఖ అమలు చేస్తున్న పథకాలు, పాడి రైతుల పెంపకం, వ్యాధులను ఎలా నివారించాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు. జిల్లాలో పశుసంవర్ధక శాఖ కార్యాలయాలు, సిబ్బంది వివరాలు తెలియజేయండి? జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాలలో 30 మండలాల్లో మూడు డివిజన్‌లలో రాయచోటి, మదనపల్లె, రాజంపేట ప్రాంతాలలో ఉప సంచాలకులు ఉన్నారు. మూడు డివిజన్లలో 18 మంది సహాయ సంచాలకులు, పశువైద్యాధి కారులు 72 మంది, గ్రామీణ పశువైద్యాధికారులు 63 మంది ఉన్నారు. 226 రైతు సేవా కేంద్రాలలో పశువైద్య సహాయకులు, 116 మంది గోపాల మిత్రలు ఉన్నారు.జిల్లాలో ఆవులు, గేదెలు ఎన్ని ఉన్నాయి? జిల్లా వ్యాప్తంగా 2.71 లక్షల ఆవులు, 1.06 లక్షల గేదెలు ఉన్నాయి. 18 లక్షల గొర్రెలు, 3 లక్షల మేకలు ఉన్నాయి. 28 లక్షల కోళ్ల్లు ఉన్నాయి. మదనపల్లె, పీలేరు, కలికిరి ప్రాంతాలలో కోళ్ల పారాలు ఎక్కువగా ఉన్నాయి.పశువులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారా? జిల్లాలో ప్రతి రైతు పశువులకు బీమా చేయించుకోవాలి. జిల్లాలో ఇప్పటివరకు మతి చెందిన పశువులకు బీమా చెల్లించాం. ప్రస్తుతం బీమా పథకం కొనసాగిస్తున్నాం. దారిద్ర రేఖకు దిగువన ఉన్న రైతులు వారి పశువులు చెల్లించిన ప్రీమియం 85 శాతంలో రాయితీతో 15 శాతం రైతు కట్టాలి. ఒక రైతు ఐదు పశువులకు వరకు బీమా చేసుకోవచ్చు. 50 గొర్రెలు, మేకలకు బీమా చేసుకోవచ్చు. మూడు సంవత్సరాల లోపు మరణిస్తే సమీప పశు సమర్థ శాఖ వారు నష్టపరిహారం చెల్లిస్తారు. 3 శాతం ప్రీమియంతో గొర్రెలు, మేకలు, పందులు ఒక సంవత్సరం బీమా రూ.6 వేలు రైతు చెల్లించవలసిన ప్రీమియం రూ.180, ప్రభుత్వ రాయితీ రూ.153 లబ్ధిదారులు వాటా రూ.27, 4.5 శాతం ప్రీమియంతో గొర్రెలు, మేకలు, పందులు రెండు సంవత్సర కాలానికి బీమా రూ.6 వేలు చెల్లించవలసిన ప్రీమియం రూ.270, ప్రీమియంలో ప్రభుత్వ రాయితీ రూ.85 శాతం రూ.230, లబ్ధిదారిని వాట రూ.15 శాతం రూ.40, 4.5 శాతం ప్రీమియంతో ప్రీమియంతో గొర్రెలు, మేకలు, పందులకు మూడు సంవత్సరాల కాలానికి బీమా రూ.6 వేలు, చెల్లించవలసిన ప్రీమియం రూ.375, ప్రీమియంలో ప్రభుత్వ రాయితీతో రూ.319, లబ్ధిదారిన వాటా రూ.56 చెల్లించవలెను. మేలు జాతి పసువులకు 6.40 శాతం ప్రీమియంతో మూడు సంవత్సరాల కాలానికి రూ.30 వేలు, చెల్లించవలసిన ప్రీమియం రూ.1920, ప్రభుత్వ రాయితీతో రూ.1632, లబ్ధిదారుని వాటా రూ.288, నాటు జాతి పశువు 6.40 శాతం ప్రీమియంతో మూడు సంవత్సరాల కాలానికి బీమా రూ.15 వేలు, చెల్లించవలసిన ప్రీమియం రూ.960, ప్రభుత్వ విలియంలో ప్రభుత్వ రాయితీతో రూ.816, లబ్ధిదారులు వాటా రూ.144 చెల్లించవలెను మరిన్ని వివరములకు దగ్గర్లోని పశువైద్యశాలలో గాని ద్వైత సేవా కేంద్రంలో గాని సంప్రదించవచ్చును.పశువులకు ఎలాంటి వ్యాధులు సంభవిస్తున్నాయి? పశువులకు ప్రస్తుతం గాలి కుంట వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధిని నివారించడానికి మార్చి 1వ తేదీ నుండి 30 తేదీ వరకు టీకాలు వేశాం. బ్రూసెల్లోజ్ వ్యాధి నివారణకు 4-8 నెలల దూడలకు ముడదపాలుగా జిల్లా వ్యాప్తంగా 39,500 డోస్‌లు వేశాం. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం గొర్రెల, మేకల వ్యాధి నివారణకు టీకాలు వేయడానికి ఈ నెలలో ప్రారంభిస్తాం.మినీ గోకులాలు ఎన్ని మంజూరయ్యాయి? జిల్లా వ్యాప్తంగా 2045-25 సంవత్సరానికి 1,156 మినీ గోకులాలు మంజూరయ్యాయి. వివిధ దశల్లో నిర్మాణంలో పనులు జరుగుతున్నాయి. సంవత్సరానికి 2,400 మినీ గోకులాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా పశువైద్య వాహనాలు ఎన్ని ఉన్నాయి? జిల్లా వ్యాప్తంగా 14 పశువైద్య వాహనాలు మంజూరయ్యాయి. మొ దటి దఫాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 6 వాహనాలు ఉన్నాయి వాటిని తాత్కాలికంగా నిలిపివేశాం. ఈ నెల ఆఖరిలో పునార ప్రారంభించిడానికి కషి చేస్తున్నాం. వాహనాలు యధావిధిగా సేవలు అందిస్తున్నాం. గ్రామీణ ప్రాం తంలో రైతులకు అవసరం ఉన్న చోటికే వెళ్లి పశువులకు వైద్య సేవలు అందిస్తు న్నాం. టోల్ ఫ్రీ నెంబర్ 1962కి ఫోన్ చేసి వైద్య సేవలు రైతులు పొందవచ్చును.సబ్సిడీకి గేదెల ఏమైనా ఇస్తున్నారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా పాడి పశువులను యూనిట్లు సబ్సిడీతో పొందవచ్చు.జిల్లాలో శిధిలా వస్థకు చేరిన పశుసంవర్ధక శాఖ కార్యాలయాలెన్ని ఉన్నాయి? జిల్లా వ్యాప్తంగా మొత్తం 70 పశుసంవర్త శాఖ భవనాలు ఉన్నాయి. 13 భవనాలను వరకు శిథిలావ్యవస్థకు చేరాయి. వాటి వివరాలు ఉన్నతాధి కారులకు ప్రతిపాదించాం. బడ్జెట్ మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.వేసవిలో గేదెలకు దాహన్ని తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వేసవి కాలంలో దష్టిలో ఉంచుకొని గేదెలు, మేకలు, గొర్రెల దాహం తీర్చేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంతో కింద పశువులకు గ్రామీణ ప్రాంతాలలో కూడలి ప్రాంతాలలో (నీటి సౌకర్యం ఉన్నచోట) నీటి తొట్ల నిర్మాణం చేపడుతున్నాం. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1084 మంజూరయ్యాయి.పశుగ్రాస అధిక మించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జిల్లాలో 75 శాతం రాయితీతో పశుగ్రాసోత్పత్తి విత్తనాలు రైతు సేవా కేంద్రంలో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు ఆధార కార్డు జిరాక్స్ తీసుకొని పొందవచ్చును. 100 శాతం సబ్సిడీతో ఉపాధి నిధుల ద్వారా బహు వర్షిక పశుగ్రాసాన్ని 10 సెంట్లు నుంచి 50 సెంట్లు వరకు ఉండవచ్చును.
