ఆదర్శ హిందీ ప్రేమీ మండలి వార్షికోత్సవం

Aadharsh hindi premi mandi annversary

 ప్రజాశక్తి -భీమునిపట్నం : ఆదర్శ హిందీ ప్రేమీ మండలి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక ఆదర్శ హిందీ ప్రేమీ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కాళ్ళ సూర్య రామకృష్ణారావు ఆధ్వర్యాన భీమిలిలో ఆదివారం ఘనంగా వేడుకలు జరిగాయి. విద్యార్థులకు తెలుగు, హిందీ మాధ్యమాల్లో వ్యాస రచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 48 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి ఆదర్శ హిందీ ప్రేమీ మండలి గౌరవాధ్యక్షులు నూకరాజు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

➡️