ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని మడికిలో గంగిశెట్టి దొరబాబు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటికి అక్టోబర్ నెలకు కరెంటు బిల్లు 215 యూనిట్లగాను 1139 రూపాయలు వచ్చింది. అలాగే డిసెంబర్ నెల విద్యుత్ బిల్లు 183 యూనిట్లకు గాను 1138 రూపాయలు వచ్చింది. అయితే విద్యుత్ వినియోగం తగ్గిన బిల్లు యధాతధంగా రావడంతో వారు ఆవేదన చెందుతున్నారు.