ప్రజాశక్తి-రాయచోటి 2019-24 మధ్య కాలంలో బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు గహాలు మంజూరై ఇంకను వివిధ దశలలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిదని కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. గహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు అందాయని అన్నారు. స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి ‘అందరికీ ఇల్లు’ ఏర్పరచాలనే దఢ నిశ్చయంతో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. పిఎంఎవై 1.0లో ఇల్లు మంజూరై ఇంకనూ వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న గృహాలకు అదనంగా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. జిల్లాలో దాదాపు 25 వేల మంది లబ్దిదారుల గృహాలు వివిధ దశలలో అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. నిర్మాణం పూర్తికి ఎస్‌సి, బిసిలకు రూ 50వేలు, ఎస్‌టిలకు రూ. 75 వేలు చొప్పున అదనంగా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఏప్రిల్ 20 లోగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని తెలిపారు. నిర్మాణం పూర్తి చేసుకునే దశల వారీగా అదనపు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాకు నేరుగా జమ చేస్తారని చెప్పారు. ఈ మేరకు లబ్ధిదారులు ఇల్లు పూర్తి చేసుకోవడానికి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ శివయ్యను ఆదేశించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అమెనిటీస్, ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లు ఈ విషయాన్ని విస్తతంగా ప్రచారం చేసి లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్వయంతో కషి చేయాలని సూచించారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడంలో నిధుల మంజూరు కొరకు మధ్యవర్తులు, ఇతరుల మోసపూరిత మాటలు నమ్మరాదని, సంబంధిత గహ నిర్మాణ సిబ్బంది, ఎంపిడిఒ, మున్సిపల్ కమిషనర్లను సంప్రదించాలని తెలిపారు. లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే గహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మొబైల్ 7093931084 నెంబరర్‌కు ఫోన్ చేసి నివత్తి చేసుకోవచ్చని సూచించారు. లబ్ధిదారులు కూడా ప్రభుత్వం అందిస్తున్న ఈ అదనపు ఆర్థిక లబ్ధి సదవకాశాన్ని వినియోగించుకొని సొంతింటి కల సాకారం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
