ప్రజాశక్తి – ఆలమూరు : ఆలమూరు జూనియర్ సివిల్ కోర్ట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ బి.విద్యా ప్రసన్నకు కొత్తపేట కోర్టుకు ఏజిపిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆమె కొత్తపేట కోర్టులోనూ విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏజిపి ప్రసన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా పేదలకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. దీంతో విద్యా ప్రసన్న చేస్తున్న సేవలను కొనియాడుతూ పలువురు అభినందనలు తెలియజేశారు.