వాటర్‌ ట్యాంక్‌ పై ఎక్కి ఖాళీ బిందెలతో ఆదివాసి గిరిజన మహిళల ధర్నా

రావికమతం (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ అజయపురం గ్రామంలో 30 కుటుంబాలు గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. 2019 సంవత్సరంలో15 ఆర్థిక సంఘం నిధుల నుండి 5 ఐదు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి గ్రామానికి కిలోమీటర్ల దూరంలో బోరు తీసి పైపు లైన్‌ ద్వారా అక్కడనుండి గ్రామానికి నీరు సరఫరా చేసేవారు. ఈ మోటర్‌ కాలిపోవడంతో నీరు కోసం ఎత్తైన కొండ గడ్డ ఊట బావిని తవ్వి అక్కడి నుండి నీరు తెచ్చుకుంటున్నారు. కిలోమీటర్‌ నర దూరంలో నీరు తెచ్చుకోవడంతో… సమయం అంతా నీటి కోసమే ఖర్చు పెడుతున్నారు. 2023 సంవత్సరంలో జల్జీవన్‌ మిషన్‌ ద్వారా 15 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. వాటర్‌ ట్యాంకును అధికారులు అసంపూర్తిగా నిర్మాణం చేసి వదిలేశారు. ఇంటింట కుళాయిలు పైపులు వేశారు. వాటిని కూడా మధ్యలో వదిలేశారు. 2024 డిసెంబర్‌ మొదటి వారంలో అజరు పురం గ్రామానికి రోడ్డు శంకుస్థాపన చేయడానికి వచ్చిన అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు సీఎం రమేష్‌ కేఎస్‌ఎన్‌ రాజు కి గ్రామస్తులకు క్లియర్‌ చేయడం జరిగింది. 15 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు… కానీ నేటికి నాలుగు నెలలు పూర్తవుతున్నప్పటికీ జల్ది వెండి మిషన్‌ ద్వారా నిర్మాణం చేసిన వాటర్‌ ట్యాంక్‌ పండ్లు అసంపూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాడైపోయిన మోటార్‌ ను వెంటనే రిపేర్‌ చేసి. మంచినీరు సరఫరా చేయాలని కోరారు. జల్జీవన్‌ మిషన్‌ అసంపూర్తిగా నిర్మాణం చేసిన వాటర్‌ ట్యాంకును పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు. పాంగి జస్వంతి. పాంగి శ్రీరామ. పాంగి చంద్రయ్య గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

➡️