దూరవిద్య కోర్సుల ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

ప్రజాశక్తి-కడప అర్బన్‌ యోగి వేమన యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ ఆన్లైన్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రఘునాథరెడ్డి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.పద్మతో కలిసి మాట్లాడుతూ వైవీయూ గుర్తింపునిచ్చిన అధ్య యన కేంద్రాల్లో ఎంఎ ఎకనామిక్స్‌, ఇంగ్లీష్‌, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, తెలుగు, ఎంకామ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయ న్నారు. బ్యాచిలర్‌ డిగ్రీలో ఎకనామిక్స్‌ చదివిన వారికి మాత్రమే ఎంఎ ఎకనామిక్స్‌లో ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. బీకాం, బిబిఎ, బిబిఎం డిగ్రీ చేసిన వారు మాత్రమే ఎంకామ్‌లో ప్రవేశాలకు అర్హులన్నారు. మిగి లిన అన్ని కోర్సులకు ఎదేని డిగ్రీ పాసైతే చాలన్నారు. ఈ ఏడాది నూత నంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్‌ మ్యూజిక్‌ నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభిం చామన్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌, సమాన అర్హత గల వారు ప్రవేశానికి అర్హులన్నారు. సర్టిఫికెట్‌ అండ్‌ డిప్లమా కోర్సులలో సైకాలజీ- కౌన్సిలింగ్‌ అండ్‌ గైడెన్స్‌, లాజిస్టిక్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్మెంట్‌, ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజ్మెంట్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెంట్‌ అండ్‌ మిషన్‌ లెర్నింగ్‌, బిగ్‌ డేటా అనాలసిస్‌ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు అని తెలిపారు. ఈ కోర్సులన్నీ డిస్టెన్స్‌, ఆన్‌లైన్‌ లర్నింగ్‌ విధానంలో ఉంటాయన్నారు. వివరాలకు ష్ట్ర్‌్‌జూర://షశీసవ.yఙబ.వసబ.ఱఅను సంప్రదించాలని సూచించారు.

➡️