కెవి, వివివిలో అడ్మిషన్లు ప్రారంభించాలి

Gangarao vinathi to Cgm

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లోని కేంద్రీయ విద్యాలయంలోనూ, విశాఖ విమల విద్యాలయంలో అడ్మిషన్లను వెంటనే ప్రారంభించాలని కోరుతూ స్టీల్‌ప్లాంట్‌ సిజిఎం జి.గాంధీకి 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు వినతిపత్రం అందజేశారు. ఉక్కునగరంలోని మిగిలిన విద్యా సంస్థలన్నీ అడ్మిషన్లు ప్రారంభించాయని, ఈ రెండు విద్యాలయాలు అడ్మిషన్లు ప్రారంభించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. కేంద్రీయ విద్యాలయాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లు కూడా ప్రారంభించారని తెలిపారు. కేంద్రీయ విద్యాలయం, విశాఖ విమల విద్యాలయం నిర్వహణకుకు అవసరమైన ఖర్చులను స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం సమకూరుస్తుందని, ఖర్చులు తగ్గించుకోవాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో గత సంవత్సరం అడ్మిషన్లు నిలుపుదలచేశారని తెలిపారు. తల్లిదండ్రుల ఆందోళనతో వెనక్కి తగ్గారని వివరించారు. ఈ రెండు విద్యాసంస్థలకు అవసరమైన నిధుల బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. గత ఆరు నెలల నుంచి ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించటానికి యాజమాన్యం నిరాకరించడం దారుణం అన్నారు. వెంటనే అడ్మిషన్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు

➡️