కబ్బడిలో ఆదోని క్రీడాకారుల ప్రతిభ

Feb 4,2025 14:03 #Adoni players, #Kabaddi, #talent

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : కబ్బడిలో ఆదోని క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. మంగళవారం అదోనిలో క్రీడాకారులను పలువురు అభినందించారు. కబ్బడి అసోసియేషన్‌ జిల్లా సహాయ కార్యదర్శి, ఫిలిఫ్‌ కబ్బడి కోచ్‌ అమర్‌ ప్రకాష్‌ మాట్లాడారు. సీనియర్‌ క్రీడాకారుడు జగదీష్‌ (డాని ) జ్ఞాపకార్థం 24వ జాలి బ్రదర్స్‌ కబడ్డీ టోర్నమెంట్‌ తుంబూర్‌ తిరుపతి జిల్లా తమిళనాడు బార్డర్‌ లో ఈనెల ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు జరిగిందన్నారు. అందులో 40 టీములు పాల్గొన్నాయని తెలిపారు. టోర్నీలో ఆదోని ఫిలిప్స్‌ కబాడీ టీం క్వాటర్‌ లో తమిళనాడు జట్టుపై గెలిచి సెమీ ఫైనల్లో కి వెళ్లిందన్నారు. కాకినాడ కబాడీ అకాడమీ ప్లేయర్స్‌ పై ఆరు పాయింట్లతో ఓడి, హౌమ్‌ టీం చిత్తూర్‌ తో ఆడి నాలుగో బహుమతి రూ 15,000 కైవసం చేసుకుందన్నారు. అందులో 3 అడుగుల కప్పు సాధించారన్నారు. ఆదోని ఫిలిప్స్‌ కబాడీ టీం నాలుగో బహుమతి సాధించినందుకు. ఫిలిప్స్‌ కబాడీ సీనియర్స్‌ ప్లేయర్స్‌ అమర్‌ ప్రకాష్‌, రామంజి, మారి,జయరాం, దుబ్బ,గోపి,నాగరాజ్‌, యు.రవి, యు.రాజు, గోవిందు, పరిష, పెద్ద ఎల్లప్ప, జూనియర్‌ ప్లేయర్స్‌ ను అభినందించారు.

➡️