క్షయ నిర్మూలనకు అడల్ట్‌ బిసిజి వ్యాక్సిన్‌

యడ్లపాడు :  క్షయను 2025 నాటికి నిర్మూలించే లక్ష్యంతో పని చేస్తున్నామని రాష్ట్ర వైద్యా రోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.అర్జున రావు చెప్పారు. మండల పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బిసిజి వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని ఆయన గురు వారం పరిశీలించారు. తొలుత యడ ్లపాడు ఆస్పత్రిని సంద ర్శించిన ఆయన వ్యాక్సిన్‌ నిల్వలను, అనంతరం వంకా యల పాడు ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. క్షయ రాకుండా బిసిజి వ్యాక్సిన్‌ ఉపయోగాలను స్థానికులకు వివ రించారు. వివరించారు. 60 ఏళ్లు దాటిన వారికి, 18 ఏళ్లు దాటిన వారిలో మొదటిగా గత ఐదేళ్లలో టిబి వ్యాధికి గురైనవారు, వ్యాధిగ్రస్తుల కుటుంబీకులకు, బాడీ మాస్‌ ఇం డెక్స్‌ 18 కిలోలు/చదరపు మీటర్‌ కంటే తక్కువ ఉన్నవారికి, పొగతాగే అలవాటున్న వారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్‌ వేస్తామని చెప్పారు. పల్నాడు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ బి.గీతాంజలి మాట్లాడుతూ యడ్ల పాడు మండల పరిధిలో 464 మంది బిసిజి వ్యాక్సిన్‌ వేయిం చుకోడానికి అంగీకారం తెలిపారని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎం.ప్రభాకరరావు, డాక్టర్‌ భరద్వాజ, ఎస్‌.పున్నారావు, సిహెచ్‌ఒ వి.రాజశేఖర్‌, బి.గంగానమ్మ పాల్గొన్నారు. రాజుపాలెం మండలంలోని అన్ని సచి వాలయాల్లో క్షయ వ్యాధి రాకుండా టీకాలు వేసే కార్యక్రమాన్ని రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ వెంకట కృష్ణకుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. గణపవరంలో వ్యాక్సి నేషన్‌ కార్య క్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ టీకా 60 ఏళ్లు పైబడిన వారికి, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు, ఐదేళ్ల లోపు క్షయ వ్యాధికి గురైన వారికి, బాడీ మాస్‌ ఇండెక్స్‌ 18 లోపు ఉన్నవారికి, పొగ తాగే అలవాటు ఉన్న వారికి, క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్న వారి కుటుంబ సభ్యులకు అడల్ట్‌ బిసిజి వ్యాక్సిన్‌ వేస్తారని డాక్టర్‌ వెంకటకృష్ణ కుమార్‌ తెలిపారు. మండలంలో 450 మందికి అడల్ట్‌ బిసిజి వ్యాక్సిన్‌ వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు జీవనరావు పాల్గొన్నారు.

➡️