కార్యకర్తలకు దద్దాల పరామర్శ

ప్రజాశక్తి-పామూరు: ఎన్నికల సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను కనిగిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్‌ పరామర్శిం చారు. కంబాలదిన్నె పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో గాయపడిన వారిని బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్‌ మాట్లాడు తూ, టిడిపి నాయకుల దౌర్జన్యాలకు ఎవరూ భయ పడవద్దని, వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. ఆయన వెంట కే రామిరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ పువ్వాడి రాంబాబు, వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

➡️