కమిషనర్‌ వైఖరిని ఖండిస్తూ .. సచివాలయ ఉద్యోగుల ఆందోళన

మార్కాపురం (ప్రకాశం జిల్లా) : మార్కాపురం మునిసిపల్‌ పరిధిలో శానిటరీ ఎన్విరాన్మెంటల్‌ సెక్రటరీ పై దుర్భాషలాడి కొట్టడానికి పోయిన మున్సిపల్‌ కమిషనర్‌ డి వి నారాయణరావు వైఖరిని నిరసిస్తూ …. మంగళవారం ఉదయం సచివాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఉద్యోగికి క్షమాపణలు చెప్పాలంటూ పురపాలక సంఘం కమిషనర్‌ తో ఎన్జీవో సంఘం నేతలు మాట్లాడుతున్నారు. సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ … మార్కాపురం మున్సిపల్‌ పరిధిలో శానిటరీ, ఎన్విరాన్మెంటల్‌ సెక్రటరీ పై మున్సిపల్‌ కమిషనర్‌ డి వి నారాయణరావు దుర్భాషలాడి కొట్టడానికి వచ్చారని ఆరోపించారు. ఇప్పటికే కమిషనర్‌ ప్రవర్తనతో విసుగుచెంది సెలవు పై కొంతమంది సెక్రటరీలు పోయారని సచివాలయ ఉద్యోగులు వాపోయారు. కమిషనర్‌ నారాయణరావు ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయామంటూ … ఎన్జీవో లకు సచివాలయ ఉద్యోగులు అసహనంతో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీ లోని కమిషనర్‌ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది.

➡️