ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సచివాలయాల ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన

Nov 27,2024 18:13 #Kurnool

 

ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం19వ వార్డులోని 46 ,48, 50, 53.
సచివాలయాలలో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని పేదలు సచివాలయం అడ్మిన్ లకు ఇంటి స్థలం అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి, నగర సహాయ కార్యదర్శి సి మహేష్,
పార్థసారథి కొట్టాల శాఖ కార్యదర్శి కుమార్రా, రాజ మారుతి నగర్ శాఖ కార్యదర్శి సులోచనమ్మ, సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, అంబేద్కర్ కాలనీ శాఖ కార్యదర్శి సత్యం, మల్లికార్జున శ్రీనివాసులు ఆదిలక్ష్మి,  పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరంలోని 19 వార్డులో దాదాపు 5వేల మంది పేదలు ఇంటి అద్దెలు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సెంటు స్థలంలో వారి ఇల్లు కట్టుకోలేక, ప్రభుత్వం మంజూరు చేసిన 1,80,000 ఏమాత్రం ఇంటి నిర్మాణానికి సరిపోదు గనుక ఆనాడు ప్రజలు ఇంటి నిర్మాణానికి ముందుకు రాలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధికారంలోకి వస్తే
పేద ప్రజలకు రెండు సెంట్లు స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు.  తెలుగుదేశం పార్టీ కుటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఐదు నెలలు కావొస్తున్నది. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం  ఇంటి స్థలం లేని పేదల కోసం కర్నూలు నగర శివార ప్రాంతాలలో నివాసయోగ్యంగా ఉండే ప్రాంతాలలో పేదోడికి రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే ఇసుక సిమెంటు స్టీలు కూడా ప్రభుత్వమే ఫ్రీగా సప్లై చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. సచివాలయం అధికారులకు వారు తెలియజేస్తూ ఈ అర్జీలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్కాన్ చేసి పంపాలని వారు కోరారు.

➡️