నరసాపురంలో వ్యవసాయ కార్మిక సంఘం సైకిల్‌ ర్యాలీ

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : కరువు, తుఫాన్లు వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్స్‌ సబ్సిడీ, పంటల బీమా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘము ఉపాధ్యక్షుడు కవురు పెద్దిరాజు అన్నారు. కేంద్ర మోడీ ప్రభుత్వ రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు,కార్మిక ,ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా … మంగళవారం నరసాపురం మండలంలోని సీతారామపురం సెంటర్‌ నుండి మొగల్తూరు వరకు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. సీతారామపురం సెంటర్‌ లో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు, రైతు సంఘము మండల కార్యదర్శి గుత్తుల శ్రీరామ చంద్ర మూర్తి, కౌలు రైతు సంగమం మండల అధ్యక్షుడు పిల్లి కామేశ్వర రావు, వ్యవసాయ కార్మిక సంఘము మండల కార్యదర్శి గుబ్బల నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా సహాయ కార్యదర్శి యడ్ల చిట్టిబాబు, రైతు సంఘము సీనియర్‌ నాయకులు ఆదూరి సాంబమూర్తి, సీఐటీయూ నాయకులు పుగాకు నారాయణ రావు, జల్లి రామ్మోహన్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

➡️