ప్రజాశక్తి-శింగరాయకొండ: శింగరాయకొండ, టంగుటూరు ప్రాంతాల అగ్రి గోల్డ్ బాధితులు శనివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామికి వినతిపత్రం అంద జేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యమంత్రితో మాట్లాడి తమను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు, జివి ప్రసాదరావు, చంద్ర, రమేష్, కె రామకృష్ణ, శ్రీనివాసులు, నాగేంద్ర, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
