ఏఐకేఎస్‌ 90వ వ్యవస్థాపక దినోత్సవం – జెండా ఆవిష్కరణ

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా, ఫ్యూడల్‌ జమిందారి విధానానికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటంలో భాగంగా ఏఐకేఎస్‌ 1936 లో ఆవిర్భవించింది. నాడు బ్రిటిష్‌ వలస దోపిడీకి, ఫ్యూడల్‌ జమిందారి దోపిడీకి వ్యతిరేకంగా రైతాంగ ప్రయోజనాల కొరకు ఏ ఐ ఎస్‌ కె ఎస్‌ పోరాడింది అని తూర్పుగోదావరి జిల్లా రైతు సంఘం కన్వీనర్‌ గారపాటి వెంకట సుబ్బారావు అన్నారు . మెయిన్‌ బజార్లో ఉన్న సిపిఎం జెండా ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ .. నేడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నది అన్నారు. భారత ప్రభుత్వం అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి లొంగిపోయి భారత రైతుల ప్రయోజనాలను అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు బలి పెడుతున్నది. సి2ం50% ప్రకారం రైతులు పండించే పంటలకు మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేందుకు నిరాకరిస్తున్నది. వ్యవసాయ రంగానికి కేంద్రబడ్జెట్‌ కేటాయింపులలో కోతలు విధిస్తున్నది. కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నది. రైతాంగ ప్రయోజనాలను నిరాకరిస్తున్నది. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ అడుగు జాడలలో నడుస్తున్నది. ఏ ఐ కె ఎస్‌ 90 వ వార్షికోత్సవాల సందర్బంగా గ్రామ, గ్రామానా రైతుసంఘం ( ఏ ఐ కె ఎస్‌ ) జెండాలు ఎగురవేసి రైతాంగ పోరాటాలను ముందుకు తీసుకువెళతామని ప్రతిజ్ఞ చేశారు . ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే కొనసాగుతున్న రైతుసంఘం సభ్యత్వ క్యాంపెయిన్‌ ను ఎక్కడా ఆపకుండా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జిల్లా కన్వీనర్‌ గారపాటి మండల వెంకట సుబ్బారావు మండల కార్యదర్శి కంకటాల బుద్ధుడు సిఐటి నాయకులు కేకే దుర్గారావు చెరక కార్యదర్శి కంకటాల బుద్ధుడు సిఐటి నాయకులు కేకే దుర్గారావు చెరకు రైతులు నాయకులు కొడవటి వెంకటరాయుడు కొటారు కృష్ణారావు ఆలపాటి శ్రీరామచంద్రమూర్తి కండిపోయిన దత్తుడు తదితరులు పాల్గొన్నారు.

➡️