ఈనాం భూముల్ని ఆక్రమించిన ఆలపాటి

Feb 19,2025 00:46

మీడియాతో మాట్లాడుతున్న బాబురావు
ప్రజాశక్తి-గుంటూరు :
ప్రభుత్వ ఈనామ్‌ భూముల్ని ఆక్రమించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ల్యాండ్‌ గ్యాబ్రింగ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన నామినేషన్‌ను తిరస్కరిం చాలని జైభీమ్‌ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు పిల్లి బాబురావు కోరారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారికి మంగళవారం వినతి పత్రం అందచేశారు. అనంతరం బాబురావు మీడియాతో మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ పలకలూరులో సర్వే నంబర్‌ 272, 280, 281లలో 46.82 ఎకరాల ఈనామ్‌ భూమిని 2004లో ఆక్రమించి, తప్పుడు ధ్రువప త్రాలు సృష్టించి, పద్మావతి నగర్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి కోట్లు గడించా రన్నారు. అప్పటి నుండి ఈ సమస్యపై పోరాడు తున్నామన్నారు. ఉన్నతాధికారులు పలు హామీ లిచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. గతేడాది నవంబర్‌లో కూడా గుంటూరు కలెక్టర్‌ గ్రీవెన్స్‌ లో అర్జీ ఇచ్చామని చెప్పారు. ఇటీవల సిఎం చంద్రబాబు ల్యాండ్‌ గ్యాబ్రింగ్‌ యాక్ట్‌ తీసుకొ చ్చామని, ప్రభుత్వ, పేదల భూములు అక్రమిం చిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తామని ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈనామ్‌ భూములు ఆక్రమించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఎన్నికలయ్యాక చట్టపరంగా పోరాటం కొనసాగిస్తామన్నారు. ఆయనవెంట ఎం.రాంబాబు, ప్రసాద్‌ ఉన్నారు.

➡️