టర్మ్ ఫీజులతో సంబంధం లేకుండా పీజీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్ష ఫీజులు కట్టించుకోవాలి : ఏఐఎస్ఎ

Mar 13,2025 15:17 #PG students, #semester exam fees, #SFI

ప్రజాశక్తి – తిరుపతి (క్యాంపస్) : టర్మ్ ఫీజులతో సంబంధం లేకుండా పీజీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్ష ఫీజులు కట్టించుకోవాలని ఏఐఎస్ఎ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో స్థానిక ఎస్వియు ఆర్ట్స్ కళాశాల ఉపాధ్యక్షులు ఆచార్య భాస్కర్ రెడ్డికి గురువారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్పులు  రాక విద్యార్థులు అల్లాడిపోతుంటే మరోపక్క పీజీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించాలి అంటే టర్న్ ఫీజు కచ్చితంగా చెల్లించాలి అనే నిబంధన పెట్టడం ఎంతవరకు సమంజసం అని వాపోయారు. ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ లు విడుదల చేయకపోతే విద్యార్థులు ఏం చేస్తారు అని వారు విమర్శించారు. టర్మ్ ఫీజుతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ సెమిస్టర్ పరీక్ష ఫీజులు చెల్లించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. సానుకూలంగా స్పందించిన వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని టర్మ్ ఫీజుతో సంబంధం లేకుండా పరీక్ష ఫీజులు చెల్లించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎ అధ్యక్షు కార్యదర్శి రంజిత్ కుమార్, చిన్న, నాయకులు రాజు, వేణు, కృష్ణవంశీ, వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️