కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పని చేయాలి: అజితారావు

ప్రజాశక్తి-త్రిపురాంతకం: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు. గురువారం మండలంలోని పాత అన్న సముద్రం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అరాచకపాలనకు ప్రజలు చరమగీతం పాడతార న్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇస్తుందని తెలిపారు. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త రాబోయే ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని కోరారు. కేంద్రంలో రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే యర్రగొండపాలెం నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తా నని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులురాలు రెహానా భాను, నాయకులు రువ్వల శ్రీను, సుగుణ తదితరులు పాల్గొన్నారు.

➡️