‘ఆకాష్‌’ విద్యార్థుల విజయకేతనం

Jun 8,2024 22:00
'ఆకాష్‌' విద్యార్థుల విజయకేతనం

విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం
‘ఆకాష్‌’ విద్యార్థుల విజయకేతనం
ప్రజాశక్తి-నెల్లూరునీట్‌, యుజి 2024 పరీక్షలో నగరానికి చెందిన విద్యార్థి పడాల సుహాస్‌ 720 మార్కులకు గాను 715 మార్కులు సాధించి ఆల్‌ ఇండియా స్థాయిలో 162వ ర్యాంకును సాధించి నగరంలో టాపర్‌గా నిలిచారని ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) చీఫ్‌ అకడమిక్‌ , బిజినెస్‌ హెడ్‌ శ్రీ ధీరజ్‌ కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు. శనివారం నగరంలోని ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీస్‌ సెంటర్‌లో విలేకర్ల సమావేశం నిర్వహిం చారు ఆయన మాట్లా డుతూ పడాల సుహాన్‌ అసా ధారణమైన ప్రదర్శన, అంకితభావం, కషి, పట్టుదలతో ఏఈఎస్‌ఎల్‌ యొక్క సమగ్ర కోచింగ్‌ ప్రోగ్రామ్‌ సహకారంతో అత్యంత ప్రతిభను కనపరిచారన్నారు. సుహాస్‌ సాధించిన ఘనత జిల్లాకు ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందన్నారు. పడాల సుహాస్‌ నీట్‌ కోసం సిద్ధం కావడానికి ఏఈఎస్‌ఎల్‌ యొక్క తరగతి గది ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్నాడు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలలో నీట్‌ ప్రధానమైందన్నారు. తన అద్భుతమైన విజయానికి కాన్సెప్ట్‌ల పట్ల మెరుగైన అవగాహన, క్రమశిక్షణతో కూడిన అధ్యయన షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటిం చడం వల్లనే ఈ విజయం సాధ్య మైందన్నారు. ఏఈ ఎస్‌ఎల్‌ కంటెంట్‌ కోచింగ్‌ లేకుండా , తక్కువ సమ యంలో వివిధ సబ్జెక్టులలో అనేక కాన్సెప్ట్ల ను అర్ధం చేసుకోవడం కష్టమన్నారు. చివరగా అసాధారణ విజయాన్ని సాధిం చినందుకు సుహాస్‌ ను అభినందించారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ (ఎంబిబిఎస్‌), డెంటల్‌ ( బిడిఎస్‌) ఆయుష్‌ ( బిఏఎంఎస్‌, బియు ఎంఎస్‌, బిహెచ్‌ఎంఎస్‌ మొదలైనవి) కోర్సులను అభ్య సించాలనుకునే విద్యార్థులకు దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్‌ సంస్థలలో, విదేశాలలో ప్రాథమిక వైద్య అర్హతను పొందాలనుకునే వారికి అర్హత పరీక్షగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రతి సంవత్సరం నీట్‌ నిర్వహి స్తుందన్నారు.

➡️