అక్షర యోధుడు రామోజీ రావు

Jun 9,2024 21:40

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: ఈనాడు మీడియా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌, పాత్రికేయ దిగ్గజం చెరుకూరి రామోజీరావు మతి పట్ల ఎంఇఒ-1 అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు పత్రికా రంగంలో ఒక ప్రత్యేక ఒరవడితో దినపత్రికను నడిపిన ఘనత రామోజీరావుకు దక్కుతుందన్నారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ ద్వారా ఎంతోమందికి శిక్షణ పొంది జర్నలిస్ట్‌లుగా నేడు తయారయ్యారన్నారు. ముఖ్యంగా సామాజిక బాధ్యతతో పత్రికా విలువలు పాటించి సమాజానికి మేలు కలిగించే సంపాదకీయాలు ఈనాడు సొంతమన్నారు. పత్రికా రంగంతో పాటు ఈటివి, చలన చిత్ర రంగంలో రామోజీరావు దేశవ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. రామోజీరావు మరణం పత్రికా రంగానికి తీరని లోటని అభివర్ణించారు.టిడిపి కార్యాలయంలో…స్థానిక పట్టణ టిడిపి కార్యాలయంలో రామోజీరావు చిత్ర పటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు గొట్టాపు వెంకట్‌ నాయుడు, సీనియర్‌ నాయకులు బర్నాల సీతారామారావు, పట్టణ కౌన్సిలర్లు కోల మధుసూదన్‌రావు, కోరాడ నారాయణరావు, పట్టణ అధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్‌, తెలుగు యువత అధ్యక్షులు పాలకొండ రాజశేఖర్‌, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.పాచిపెంట : తెలుగు పత్రిక రంగానికి మచ్చుతునకగా ఎనలేని కృషి చేసిన వ్యక్తి రామోజీరావు అని ఆయన మతి పత్రికా రంగానికి తీరని లోటని పాచిపెంట మండలం ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు అన్నారు. ఈ సందర్భంగా ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.సీతానగరం: మండల టిడిపి నాయకులు సాల హరిగోపాల్‌ రావు ఇంటివద్ద రామోజీరావుకు నాయకులు సంతాపం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌.వేణుగోపాలనాయుడు, పి.సత్యంనాయుడు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కె.అరవింద్‌ కుమార్‌, దామినేని పెద్దబ్బాయి, మాజీ ఎంపిటిసి సభాను శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌ బిబి శ్రీనివాసరావు, బి.శంకర్రావు, తెంటు రామారావు, వాకాడ పారినాయుడు, బొమ్మలేని లక్షణరావు, కొట్టాల రామకృష్ణ, యోగిరెడ్డి భాస్కరరావుతో పటు పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️