ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ నామినేషన్‌ దాఖలు

Feb 7,2025 23:02

నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందచేస్తున్న అభ్యర్థి ఆలపాటి, మంత్రులు, ఎమ్మెల్యేలు
ప్రజాశక్తి-గుంటూరు :
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. తొలుత వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల నాయకులతో వచ్చి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారధి, నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్యేలు శ్రావణ్‌కుమార్‌, నక్కా ఆనంద్‌బాబు, గళ్లా మాధవి, నసీర్‌ అహ్మద్‌, కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మారెడ్డి, కామినేని శ్రీనివాస్‌, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, డాక్టర్‌ చదలవాడ అరవింద్‌బాబు, జి.వి.ఆంజనేయులు, భాష్యం ప్రవీణ్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డేగల ప్రభాకర్‌, మన్నవ మోహన్‌కృష్ణ పాల్గొన్నారు. మంత్రి పార్థసారధి మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అని, ఆయన విజయం తథ్యమని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టటం ద్వారా 33 నియోజకవర్గాల పరిధిలో సమస్యలపై కృషి చేయటానికి అవకాశం వచ్చిందని, గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తానని చెప్పారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించటానికి కృషి చేస్తానన్నారు.

➡️