ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : మండల ప్రజా పరిష్యత్ కార్యాలయం ఎంపిడిఒగా అలవలపాటి ముకుందరెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన వెంపల్లె లోని గండి వీరంజనేయ స్వామి ఆలయం అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. బాధ్యతల అనంతరం ఎంపిడిఒ మాట్లాడుతూ …. మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు సహకరించాలని కోరారు. గ్రామ పంచాయతీల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని ముకుందరెడ్డి తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు చేరువ చేసేందుకు కృషి చేస్తామన్నారు.
