ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ సహకరించారు

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న జనసేన అభ్యర్థి సుందరపు విజరుకుమార్‌

ప్రజాశక్తి-అచ్యుతాపురం

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించారని ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజరు కుమార్‌ అన్నారు. అచ్యుతాపురంలో మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఐదు సంవత్సరాల పాటు కష్టపడి పనిచేసి ప్రజల సమస్యలపై పోరాడినందుకు ప్రతిస్పందన ఊహించిన దానికన్నా అత్యధికంగా వస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వారి బాధ్యత నిర్వర్తించారన్నారు. ప్రజలు ఆశించినట్లుగా రానున్న ఐదేళ్లలో కొత్త తరహా పాలన అందించడానికి తన సాయి శక్తులా పని చేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో తన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎలమంచిలి నియోజకవర్గంలో 85 శాతానికి పైగా పోలింగ్‌ జరిగిందన్నారు. పోలింగ్‌ సందర్భంగా మండుటెండలో నిలబడి ఓట్లు వేసిన వృద్ధులు, వికలాంగులు, మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్‌ కుమార్‌, మండల అధ్యక్షుడు జనపరెడ్డి నరసింహారావు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బయలుపూడి రామదాసు, బిజెపి నియోజవర్గ అధ్యక్షుడు రాజాన సన్యాసినాయుడు, ధూళి రంగనాయకులు, ద్వారపురెడ్డి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

➡️