పెదకూరపాడు: గ్రామ సభలు జరిపి అర్హులందరికీ కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు కోరారు.సోమవారం తహశీల్దార్ జీవిగుంట ప్రభాకర్ రావుకి వినతి పత్రం అందించారు. జిల్లా రైతు సంఘం నాయ కులు దర్శి శేషా రావు మాట్లా డుతూ గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించి కౌలుకు పొలము తీసుకొని సాగు చేసే వారందరికీ గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు. గ్రామ సచివాలయ సిబ్బంది చేత ఇంటింటి సర్వే నిర్వహించి కార్డులు ఇవ్వాలన్నారు. భూస్వామి సంతకం లేకుండానే కార్డు ఇవ్వాలన్నారు. ఈ కార్డుల ద్వారా పంట అమ్ముకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఎరువులు, విత్తనాలు సబ్సిడీ కోసం వినియోగించుకోవచ్చున్నారు. ప్రభుత్వం అందించే రాయితీలు కౌలు రైతులకు దక్కాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు బంకా దాసు, బంకా శ్రీనివాసరావు బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
