అంబేద్కర్ జయంతిని అవమానపరిచిన కూటమి ప్రభుత్వం

Apr 15,2025 16:22 #Kurnool

ప్రజాశక్తి – ఆదోని : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించకుండా కూటమి ప్రభుత్వం అవమానపరిచిందని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గుడిసె మహానంది, కెవిపిఎస్ నాయకులు తిక్కప్ప లు విమర్శించారు. మంగళవారం ఆదోని పట్టణంలోని స్థానిక మున్సిపల్ గ్రౌండ్ ఆవరణంలో నిర్వచించిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఏ పార్టీ అధికారంలో ఉన్న అంబేద్కర్ జయంతిని ప్రభుత్వమే ఘనంగా నిర్వహించేదన్నారు. తెలుగుదేశం, జనసేన కూటమిలోకి బిజెపి చేరడంతో అంబేద్కర్ జయంతిని అవమానపరిచే విధంగా, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలన్న ఉద్దేశంతో బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాస్తు పలుకుతుoదన్నారు. విజయవాడలో నిర్మించిన 125 అడుగుల ఎత్తులో సామాజిక న్యాయ మహా శిల్పాన్ని నిర్మిస్తే కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ శిల్పాన్ని ప్రయివేట్ వారికి అప్పగించి సొమ్ము చేసుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. అంబేద్కర్ జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేదని దీన్ని నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మళ్లీ నిర్వహిస్తామని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో మరకట్టు కృష్ణ, ములుగుందం సర్పంచ్ భర్త ఏసోబు, రాజు, బసాపురం ఈరన్న, వెంకటేష్, కుమార్, రవి వెంకటరాముడు వున్నారు.

➡️