ఓటు హక్కును ఉపయోగించుకోండి

ఓటు హక్కును ఉపయోగించు కోవాలని

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించు కోవాలని వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ నేషనల్‌ చైర్మన్‌ రావూరి బాలరాజు కోరారు. మండలంలోని కొర్రాయి పంచాయతీ జామ్‌గుడ గ్రామంలో ఆ పంచాయతీ సర్పంచ్‌ పి.కొములు ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి దేశం కూడా ప్రపంచదేశాల మానవ సంబంధాలకు సంబంధించి డిక్లరేషన్‌ 1952వ సంత్సరంలో ఎప్పుడైతే పొందుపరచబడిందో ప్రపంచ దేశాల వాలు మొత్తం కలిసి ఐక్యరాజ్య సమితి ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకు మేము పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ మానవ హక్కుల అవగాహన కలిగివుండలని, ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఓటు వినీయోగించు కోవాలన్నారు. అనంతరం ప్రపంచ హ్యూమన్‌ రైట్స్‌ ఆక్టివిటీ క్యాలండర్‌ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి బురిడీ విక్రందేవ్‌ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో హెల్త్‌ క్యాంపు నిర్వహించాలని చైర్మన్‌ను కోరామన్నారు. గిరిజన గ్రామాలలో సమస్యలు హ్యూమన్‌ రైట్స్‌ ద్వారా పరిష్కారం చేయాలనీ కోరామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాముగూడ స్కూల్‌ పదవ తరగతి పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ సామగ్రి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో హ్యూమన్‌ రైట్స్‌ ఎడ్యుకేషన్‌ వింగ్‌ చైర్మన్‌, ఎడ్యుకేషన్‌ వింగ్‌ కార్యదర్శి, ఎగ్జిక్యూటీ మెంబర్‌ పప్పు సన్యాసినాయుడు, మండల ప్రెసిడెంట్‌ జగన్నాధం, వినయోగదారుల సంఘ అధ్యక్షులు చిట్టిబాబు, దిశ పౌండేషన్‌ అధ్యక్షులు సరస్వతి, గిరిజనులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️