కాఫీ కార్మికులకు కూలి రేట్లు పెంచండి.

వినతిపత్రం అందేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-పాడేరు: వేజ్‌ బోర్డు రేటు ప్రకారం కాఫీ కార్మికుల కూలి రేట్లు పెంచాలని కోరుతూ సోమవారం ఏపీఎఫ్‌డిసి డివిజనల్‌ మేనేజర్‌ జి.కృష్ణ బాబుకు కాఫీ కార్మికుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎల్‌.సుందరరావు మాట్లాడుతూ, కాఫీ కార్మికులకు ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో మినిమమ్‌ వేజ్‌ ప్రకారం పెరగవలసిన కూలి రేట్లు వెంటనే పెంచాలని డిమాండ్‌ చేశారు. 2023 అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు పెంచకపోగా కాపీ కార్మికులు వేలాది మందిగా రోజువారి వేతనంలో పెరిగిన వేతనం అందక నష్టపోవడం జరుగుతోందన్నారు తక్షణమే పేరిగిన కూలి రేట్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. వివిధ స్థాయిలో సిబ్బంది నియామకం చేపట్టాలని, ఏపీసి విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులకు 26 రోజుల పని దినాలు కల్పిపించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు పిఎఫ్‌, అన్ని ఎస్టేట్‌ పరిధిలో కార్మికుల నివాస గృహాల మరమ్మతు, మంచి నీటి సమస్య పరిష్కారం చేయాలన్నారు. తోటల్లో వాచ్మెన్‌ లను నియామకం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు మండల కార్యదర్శి. దాసమ్మ, మండల కమిటీ సభ్యులు పార్వతమ్మ, సర్బు నాయుడు పాల్గొన్నారు.

➡️