ఘనంగా ఇఫ్తార్‌ వేడుకలు

ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి ఖురాన్‌ను ఇస్తున్న ముస్లిములు

ప్రజాశక్తి-చింతపల్లి: రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని కుల మతాలకు అతీతంగా ముస్లింలు స్థాని మసీదులో ఇఫ్తార్‌ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, తెదేపా పాడేరు నియోజకవర్గ అభ్యర్థి కిల్లు రమేష్‌ నాయుడు, స్థానిక జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, ఎంపీపీ కోరాబు అనూష దేవి, బోయిన కుమారి, చింతపల్లి, బలపం సర్పంచ్‌ లు దురియా పుష్పలత, కొర్ర రమేష్‌ నాయుడు, ఎంపీటీసీ సభ్యురాలు దాసరి ధారలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️