టిడిపి నేతల భారీ ర్యాలీ

ర్యాలీ చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి -పాడేరు: పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి టిడిపి సీటు కేటాయించాలని, అభ్యర్థి ఎంపికలో అధిష్టానం పునరాలోచన చేయాలని కోరుతూ నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు పట్టణ వీధుల్లో. సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పాడేరు టికెట్‌ గిడ్డి ఈశ్వరికి కేటాయించాలని అనుచరులు డిమాండ్‌ చేశారు. లేదంటే పాడేరు నియోజకవర్గం అభ్యర్థి, అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను కూడా ఓడిస్తామని అనుచరులు హెచ్చరించారు. గిడ్డి ఈశ్వరి నివాసం నుండి మొదలైన ర్యాలీ ఐటీడీఏ, పాత బస్టాండ్‌, బజార్‌ మీదుగా పురవీధుల్లో కొనసాగింది. పాడేరు నియోజకవర్గం 5 మండలాల్లో నుండి మండల అధ్యక్షులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️