డిఎస్‌సి అప్రెంటిస్‌ జిఒ పత్రాల దగ్ధం

దగ్ధం చేస్తున్న యుటిఎఫ్‌ నేతలు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: డీఎస్సీ 2024 నోటీఫికేషన్లో రెండేళ్ల అప్రంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రంలో యూటీఎఫ్‌ నాయకులు నిరసిన చేపట్టారు. జీవో పత్రాలను సోమవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి వి.మహేశ్వరరావు మాట్లాడుతూ, దుర్మార్గమైన అప్రెంటిస్‌ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించడం తగదన్నారు. నాలుగున్నర ఏళ్లుగా ఒక్క డీఎస్సీ ప్రకటించని ప్రభుత్వం కంటి తుడుపుగా ప్రకటించి మోసం చేయడానికేనని చెప్పారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలక్రిష్ణ, జిల్లా కౌన్సిలర్లు ఎస్‌.కన్నయ్య, గౌరవ అధ్యకుడు సుబ్బారావు, రమణమ్మ, మేఘనాథ్‌, సీతన్న, మధు పాల్గొన్నారు.

➡️