తూటంగిలో వైద్యశిబిరం

వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని తూటంగి పంచాయతీ కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి.రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న సుమారు 200 మంది వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక వైద్య నిపుణులు విజరు కుమార్‌, స్థానిక వైద్యులు రాంబాబు, అంబిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఒ సౌరి, ఎంఎల్‌ హెచ్‌పి, హెల్త్‌ అసిస్టెంట్‌ ప్రభాకర్‌, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️