రూ.59 లక్షల పరిహారం పంపిణీ

చెక్కులను అందజేస్తున్న కలెక్టర్‌, ఎమ్మ్లెల్యేలు

ప్రజాశక్తి-పాడేరు : ఆర్టీసి బస్సు ప్రమాద బాధితులకు రూ.59లక్షల పరిహారం పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. 2023 ఆగస్టు 20న పాడేరు మండలం మోదాపల్లి పంచాయతీ పరిధిలోని ఘాట్‌ రోడ్డులో ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు ప్రమాదానికి గురైన సంఘటన విధితమే. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కుటుంబాలకు ఒక్కొరికి రూ.10 లక్షల చొప్పున అప్పట్లోనే పంపిణీ చేసామన్నారు. బస్సు ప్రమాద బాధితులు 31 మందికి రూ.39 లక్షల పరిహారాన్ని సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిలు బాధితులకు చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, బాధితులకు రూ.59 లక్షల పరిహారం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మిగిలిన 31 మందిలో తీవ్రంగా గాయ పడిన ఇద్దరకు రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైన 29 మంది బాధితులకు 1 లక్ష చొప్పున పరిహారం అందిస్తున్నామన్నారు.పాడేరు శాసన సభ్యురాలు కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎంపిపి సొనారి రత్నకుమారి, పలువురు సర్పంచులు పాల్గొన్నారు.

➡️