సిపిఎం ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించండి

ఫోటో: మాట్లాడుతున్న సురేంద్ర, గంగరాజు, బాలదేవ్‌.

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌:ఆదివాసీ హక్కులు, చట్టాలు రక్షించే సిపిఎం అరకు పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సురేంద్ర, జిల్లా నాయకులు పి.బాలదేవ్‌, అనంతగిరి జెడ్పిటిసి డి.గంగరాజు కోరారు. అరకువేలి మండలం తురాయిగూడ, కరాయిగూడ దేవస్థానం ఆవరణంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, ఆదివాసీల సమగ్ర అభివృద్ధి కోసం పని చేసే సిపిఎం అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చినలబుడు పంచాయతీలో అత్యధిక మంది వ్యవసాయ రైతులు ఉన్నారని, కాయగూరలు, పప్పు దినుసుల పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్మాణం చేయాలని, పంటలకు మార్కెట్‌ సదుపాయం కల్పించి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 9 చెక్‌ డ్యామ్‌లు తక్షణమే మరమ్మతు చేసి సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కె.మొద్దు, నాయకులు లోక్కోయి సహదేవ్‌, గాసి, రత్నకుమారి, ముకుంద్‌ పాల్గొన్నారు.అనంతగిరి: బీజేపీకి కొమ్ము కాస్తున్న పార్టీలను ఓడించి సీపీఎం బలపర్చిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం మండల కార్యదర్శి సోమెల నాగులు కోరారు. మండలంలోని కాశీపట్నం పంచాయతీ ఫలంవలస గ్రామంలో సీపీఎం బూత్‌ స్థాయి సమావేశం మామిడి క్రిష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి నాగులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన బీజేపీకి మద్దతు ఇచ్చిన టిడిపి, జనసేన పరోక్షంగా మద్దతు ఇస్తున్న వైసీపీ పార్టీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రజల కోసం పోరాటం చేస్తున్న సీపీఎం అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సిపిఎంతోనే మన భూములకు రక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టోకూరు సీపీఎం సర్పంచ్‌ కిల్లో మోస్య, నాయకులు కాకర సింగులు, జర్రా రాము, సన్యాసి వీరన్న తదితరులు పాల్గొన్నారు.కొత్తపల్లి గీతను ఒడించండిపెదబయలు:మండలంలోని సీతగుంట, లక్ష్మిపేట బొండాపల్లిలో సిపిఎం సీనియర్‌ నాయకులు కీల్లో సురేంద్ర, అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు గంగరాజు, నాయకులు బొండా సన్నిబాబు జే.సునీల్‌ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలు సురేంద్ర, గంగరాజు మాట్లాడుతూ,మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఆదివాసీ ప్రాంతంలో విస్తారమైన ఖనిజ సంపదను దోచుకుని ఎన్నికల బరిలో మళ్లీ నిలుస్తున్నారన్నారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు బిజెపి ఆలోచన చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️