గిరిజన మహిళల వినూత్న నిరసన

డోలీ మోస్తూ చేపడుతున్న నిరసన

ప్రజాశక్తి-అనంతగిరి:మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని కివర్ల పంచాయతీ జగడాలమామిడి, తెంగిళ్లబంధ, సీమరాయి ఆదివాసి గిరిజన మహిళలు శుక్రవారం డోలి మోతతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాలకు రోడ్ల పనులు 2020 సంవత్సరంలో ప్రారంభించినా నేటికీ పూర్తి చేయలేదని, నిధులు స్వాహా చేశారన్నారు. నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఉన్నతాధికారులు కనీసం పర్యవేక్షణ చేయలేదని మండి పడ్డారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు డోలి మోత తప్ప మరో మార్గం లేదని, దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కె రంగ, చిన్నాలమ్మ, సిదరి చిలుకమ్మ పాల్గొన్నారు.

➡️