తాగునీటి సమస్యను పరిష్కరించాలి

గెడ్డలో నీటిని పరిశీలిస్తున్న నేతలు

ప్రజాశక్తి -అనంతగిరి: మండలంలోని పెద్దబిడ్డ పంచాయతీ ఊటమామిడి గ్రామంలో మంచినీటి పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని సీపీఎం నేతలు విమర్శించారు. గ్రామంలో బుధవారం సీపీఎం బృందం పర్యటించింది. సిపిఎం మండల కార్యదర్శి సోమెల నాగులు, నాయకులు సీవేరి కొండలరావు, వంతల బుద్రయ్య గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు మాట్లాడుతూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, బోరు, బావి, వంటివి లేవని తెలిపారు.గ్రామానికి సమీపంలో ఉన్న ఊట గెడ్డను పరిశీలించారు. తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. అనంతరం ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ, కలుషితమైన గెడ్డ నీటిని ఆశ్రయించి పలు రోగాల బారినపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్యాసి, సోమన్న, బుద్రన్న, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

➡️