తాగునీటి సమస్యపై నిరసన

నినాదాలు చేస్తున్న మహిళలు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:మండలంలోని బొండం పంచాయతీ కొత్తవలస గ్రామంలో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా నిర్మించిన వాటర్‌ ట్యాంక్‌ కనెక్షన్‌ ఇచ్చి ఇంటింటికి తాగునీరు అందించాలని సోమవారం మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఐద్వా రాష్ట్ర కమిటి సభ్యులు వివి జయ ఆమె మాట్లాడుతూ, జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద ప్రభుత్వం వాటర్‌ ట్యాంక్‌, ఇంటి ఇంటికి కుళాయి కనెక్షన్‌ కోసం సుమారు రూ 7 లక్షల మంజూరు చేసిందన్నారు. గుత్తేదారుడు బోర్‌ తో పాటు వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం చేపట్టి ఏడాది కావస్తున్నా వాటర్‌ కనెక్షన్లు ఇవ్వలేదని, దీంతో తాగు నీటికి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన మహిళా సంఘం నాయకురాలు జి.సన్యాసమ్మ, రాధికా, లక్ష్మి, సుందరమ్మ, నీలమ్మ, గ్రామస్తులు జి.శాంతి, ప్రియ, కలిమ, నూకాలమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️