1/70 చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు

రికార్డులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రేగం

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:గిరిజన ప్రాం తంలో 1/70 చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. మంగళవారం అరకులోయ మండలం పద్మపురం మేజర్‌ పంచాయితీ కేంద్రంలో పర్యటించి పంచాయితీ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఆరా తీశారు. గిరిజన ప్రాంతంలో 1/70 చట్టాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు చేతుల్లోకి తీసుకుంటే చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు.పంచాయితీ పరిధిలో అక్రమ నిర్మాణాల వివరాలను రెండు రోజుల్లో అందించాలన్నారు. పంచాయతీ కార్యాలయంలో అటెండెన్స్‌, లివ్‌ రిజిష్టర్‌ డేటా సరిగా లేక పోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉద్యోగం బాధ్యతగా చెయ్యాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో నిర్వహిస్తున్న మెడికల్‌ క్యాంపునకు హాజరై ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.ఈ కార్యక్రమంలో పద్మపురం పంచాయితీ సర్పంచ్‌ పెట్టేలీ సుస్మితా, మండల తహశీల్దార్‌ పద్మపురం పంచాయితీ అధికారులు ఉన్నారు.

➡️