చెట్టు పడి కారు ధ్వంసం

ప్రజాశక్తి-పెదబయలు : అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండల కేంద్రంలో శుక్రవారం 4 గంటల నుంచి 5 గంటల సమయములో భారీ వర్షం గాలులు కురవడం మూలంగా పెదబయలు మండల కేంద్రంలో అనేక మంది గిరిజన ఇళ్లపై, ఈనాడు దినపత్రిక వేలేఖరి ఎల్, సత్యనారాయణ ( చంటి )కారుపై, చెట్ల కులడంతో కారు ధ్వంసం అయ్యింది. అదేవిదంగా జి, సి, సి డిపో సమీపంలో 70 ఏళ్ల బారి వృక్షం కులడంతో ఉద్యోగి కారు, రెంటల్ కాలనీ ఇల్లు ధ్వంసం అయ్యాయి, ఇల్లు కార్లు ద్విచక్ర వాహనాలు, ధ్వంసం కావడం వల్ల వేలాది రూపాయలు నష్టం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయినటువంటి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని గిరిజనసంఘం పూర్వ అల్లూరి జిల్లా అధ్యక్షులు బోండా సన్నిబాబు శనివారం డిమాండ్ చేసారు. మండల కేంద్రంలో గల కిముడు సంజీవ్ బాబు దివ్యాంగుడు వాళ్ళ ఇంటిపై నేరడు వృక్షం విరిగిపడడం, ఇల్లు కూలిపోవటము తో వేలాది రూపాయలు నష్టం జరిగిందని, అలాగే సత్యనారాయణ ఈనాడు రిపోర్టర్ కార్ నెంబర్ ఏపీ 31 బి జీరో నైన్ జీరో 3 కారుపై, ద్విచక్ర వాహనం నంబర్ ఏపీ 31 ఈయూ 8213 పై వృక్షం కూలడం వల్ల లక్ష రాతి రూపాయలు నష్టం జరిగిందని వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపోయినటువంటి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం అన్నారు. అకాల వర్షం వల్ల నష్టపోయినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొండా సన్నిబాబు ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.

➡️