ప్రజాశక్తి-అరకులోయరూరల్:అల్లూరి సీతారా మ రాజు అరకు ఎండపల్లివలస మధ్య మురద గడ్డ వంతెన వద్ద రోడ్డులో ఉన్న కల్వర్టు ప్రమాదకరంగా ఉంది.ఈ రోడ్డ పాడేరు,అరకు ప్రధాన రహదారి కావడంతో నిత్యమూ వందలాది వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి.ఈ వంతెన వద్ద కల్వర్టు కూలిపోవడం ప్రమాదకరంగా మారింది.వాహనదారులు ఏ మాత్రం ఆదమర్చిన ప్రాణానికే ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొంది.ఇక్కడ ఇటీవల చాల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.అధికారులు ప్రజాప్రతినిధులు నిత్యం ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు,కానీ ఎవ్వరు కూడా పట్టించుకోకుండా చూస్తూ చూడనట్టు వ్యవహరించడం పై వాహనదారులు మండిపడుతున్నారు.ప్రమాదాల దష్ట్యా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు.
