విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి

Oct 8,2024 00:33
ర్యాలీ చేపడుతున్న ఆదివాసీ గిరిజన మహిళా సంఘం నేతలు

ప్రజాశక్తి-హుకుంపేట:అల్లూరి జిల్లా పాడేరు విద్యాశాఖ కార్యాలయంలో ఆదివాసీ మహిళ మొస్య సుజాతను కులం పేరుతో దూషించి ఆగ్రహావేశాలతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎడి, జూనియర్‌ అసిస్టెంట్లను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన మహిళ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.హైమావతి డిమాండ్‌ చేశారు. మండలంలో సోమవారం నిరసన చేపట్టారు. దాడి చేసిన వారినిౖ వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు.గిరిజన మహిళలపై చిన్నచూపు చూస్తే ఆదివాసి గిరిజన మహిళ సంఘం చూస్తూ ఊరుకోదన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు.

➡️