కాఫీ పండ్ల సేకరణలో లక్ష్యాలు సాధించకుంటే చర్యలు

Jan 11,2025 23:35
మాట్లాడుతున్న పిఒ

ప్రజాశక్తి-పాడేరు : కాఫీ పళ్ళు సేకరణ లక్ష్యాలు సాధించకపోతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఐటిడిఏ ప్రాజెక్ట్‌ అధికారి వి .అభిషేక్‌ హెచ్చరించారు. శనివారం ఐటీడీఏ కార్యాలయంలో అరకు నియోజక వర్గం మండలాల కాఫీ ఏఈవోలు, ఫీల్డ్‌ కన్సల్టెంట్లు, హార్టికల్చర్‌ కన్సల్టెంట్లతో కాఫీ పండ్ల సేకరణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 20వ తేదీ నాటికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. అరకు నియోజకవర్గ పరిధిలోని సిబ్బంది పనితీరు మార్చు కోవాలని ఆదేశించారు. కాఫీ ప్రాజెక్ట్‌ ను నిర్వహించడానికి క్షేత్రస్థాయి సిబ్బంది కష్టపడి పని చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలు సాధించిన సిబ్బందికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని చెప్పారు. కాఫీ పండ్ల సేకరణలో 50 శాతం లక్ష్యాలు సాధించిన సిబ్బందిని కొనసాగిస్తామని, సాధించలేని సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం. వెంకటేశ్వరరావు, ఏఈవోలు, ఫీల్డ్‌ కన్సల్టెంట్లు, హార్టికల్చర్‌ కన్సల్టెంట్లు పాల్గొన్నారు.

➡️