ప్రజాశక్తి-పాడేరు టౌన్: ఐటిడిఎ పిఒగా అదనపు బాధ్యతలను జాయింట్ కలెక్టర్ .ఎం.జె.అభిషక్ గౌడ (2020 ఐఎఎస్) సోమవారం స్వీకరించారు. బదిలీపై వెళుతున్న పిఒ వి.అభిషేక్ రిలీవ్ అయ్యారు. అభిషేక్ గౌడ్ 2024 జూలై 22 నుండి జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నూతన పిఒగా బాధ్యతలు స్వీకరించిన ఎం.జె.అభిషేక్ గౌడ్‌కు ఐటిడిఎ ఎపిఒలు వి.ఎస్. ప్రభాకరరావు, ఎం.వేంకటేశ్వరరావు, పరిపాల నాధికారి ఎం.హేమలత, టిడబ్ల్యూ డిడి ఎల్.రజని, డిఆర్ డిఎ పిడి వి.మురళి, గురుకులం ప్రిన్సిపాల్ పిఎస్‌ఎన్ మూర్తి, టిడబ్ల్యూ ఇఇ జి.డేవిడ్ రాజు, ఎఇ దుర్గా ప్రసాద్, తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
